దళిత బాలుడిని చితకబాది మూత్రం తాగించారుc

దళిత బాలుడిని చితకబాది మూత్రం తాగించారుc
  •  యూపీలో దారుణం, ముగ్గురి అరెస్టు

లక్నో: దళిత బాలుడిని  ముగ్గురు వ్యక్తులు చితకబాది బలవంతంగా మూత్రం తాగించారు. ఉత్తరప్రదేశ్​లోని శ్రావస్తి జిల్లాలో ఈ నెల 10న ఈ దారుణం చోటుచేసుకుంది. బాలుడు స్థానికంగా టెక్నీషియన్​గా పనిచేస్తున్నాడు. ఫంక్షన్లలో ఆడియో సిస్టమ్​ ఏర్పాటుచేస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఈ నెల 10న సాయంత్రం ఇంటికి వెళుతున్న బాలుడిని కిషన్  తివారీ, దిలిప్  మిశ్రా, సత్యం తివారీ అడ్డగించారు. 

తాగిన మైకంలో ఉన్న ఆ ముగ్గురూ బాలుడిని తీవ్రంగా కొట్టారు. దిలీప్  మిశ్రా ఒక బాటిల్​లో మూత్రంపోసి బాలుడితో బలవంతంగా తాగించాడు. దీనిని వీడియో తీసి సోషల్  మీడియాలో పోస్టు చేశాడు. అనంతరం బాధితుడు ఇంటికెళ్లి కుటుంబ సభ్యులకు జరిగింది చెప్పాడు. తర్వాతి రోజు బాలుడి సోదరుడు, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసి గురువారం ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. 

కాగా.. ఓ ఫంక్షన్​లో ఆ బాలుడు డీజే ఏర్పాటుచేసి తమ నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేశాడని, మధ్యలోనే డీజే ఆఫ్  చేశాడని నిందితులు ఆరోపించారు. తాను అలా చేయలేదని, జనరేటర్ లో పెట్రోల్  అయిపోయినందువల్లే డీజే ఆఫ్  అయిందని బాలుడు తెలిపాడు. అప్పటి నుంచి అతనిపై ఆ ముగ్గురూ కక్ష పెంచుకుని, ఈ దారుణానికి తెగబడ్డారు.