పొలంలో మూత్రవిసర్జన చేశాడని కాళ్లు, చేతులు కట్టేసి..

పొలంలో మూత్రవిసర్జన చేశాడని కాళ్లు, చేతులు కట్టేసి..

తమిళనాడులో దారుణం జరిగింది. అగ్రవర్ణాల దాడిలో ఓ దళిత యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పొలంలో మూత్ర విసర్జన చేశాడన్న కారణంతో యువకుడిని చితకబాదారు. ఈ దాడిలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దారుణ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లా జింజీలో జరిగింది. జింజీకి చెందిన శక్తివేల్ స్థానిక పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. అతను విధుల నుంచి ఇంటికి వెళ్లే మార్గమధ్యలో మూత్రవిసర్జన కోసం ఒక ఖాళీ స్థలం వద్ద ఆగాడు. అది గమనించి అక్కడే ఉన్న ఒక మహిళ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అది చూసిన శక్తివేల్ అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. కానీ, అప్పటికే ఆ మహిళ చుట్టు పక్కల వాళ్లని పిలిచి శక్తివేల్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. దాంతో అక్కడికి వచ్చిన వాళ్లు శక్తివేల్‌ని కాళ్లు, చేతులు కట్టేసి తీవ్రంగా కొట్టారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పెరియాతచూర్ పోలీసులు.. శక్తివేల్ సోదరిని పిలిపించి యువకుడిని అతని ఇంటికి పంపిచారు. ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికి అపస్మారక స్థితిలోకి వెళ్లిన శక్తివేల్ మరణించాడని యువకుడి సోదరి తెలిపింది. దాంతో ఆ యువకుడి కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు యువకుడిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేశారు. అందులో ముగ్గురు మహిళలు కూడా ఉండటం గమనార్హం.

For More News..

తల్లి అంత్యక్రియలకు వస్తూ కొడుకు, కోడలు మృతి

బాయ్ ఫ్రెండ్‌తో కలిసి తల్లిని చంపిన కూతురు