కరెంట్ షాక్ తో రైతు మృతి..మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో ఘటన

కరెంట్ షాక్ తో  రైతు మృతి..మెదక్  జిల్లా వెల్దుర్తి మండలంలో ఘటన

వెల్దుర్తి, వెలుగు: కరెంట్ షాక్ తో మెదక్  జిల్లా వెల్దుర్తి మండలం కలాన్  శెట్టిపల్లి గ్రామానికి చెందిన రైతు చనిపోయాడు. ఎస్సై రాజు  తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పైన కిషన్(42) ఉదయం 7 గంటల సమయంలో తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. ఇంటికి తిరిగి రాకపోవడంతో కొడుకు హరీశ్​ పొలం వద్దకు వెళ్లి చూడగా, మోటార్​ స్టార్టర్  బాక్స్  వద్ద కరెంట్​ షాక్​ తగిలి తండ్రి పడి ఉండడం గమనించాడు. పక్కనే ఉన్న రైతులను పిలిచి చూడగా, అప్పటికే కిషన్  చనిపోయినట్లు కుటుంబీకులు తెలిపారు. మృతుడి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.