మంచిర్యాల, వెలుగు : కరెంట్ షాక్ తో రైతు చనిపోయిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. హాజీపూర్ మండలం పెద్దంపేటకు చెందిన దోసారపు రైతు సతీశ్ గౌడ్(39), స్రవంతి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. సతీశ్ గ్రామ శివారులో భూమిని కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. శుక్రవారం ఉదయం అతడు పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. మోటార్ స్విచ్ఛ్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టడడంతో తీవ్రంగా గాయపడిన అతడు స్పాట్ లో చనిపోయాడు. మృతుడి భార్య స్రవంతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
