పిల్లల ప్రొటెక్షన్​..సేఫ్టీ కోసం ప్రత్యేకంగా కొన్ని టూల్స్

 పిల్లల ప్రొటెక్షన్​..సేఫ్టీ కోసం ప్రత్యేకంగా కొన్ని టూల్స్

టెంపరేచర్​ బాతుబొమ్మ

పిల్లలు కాస్త పెద్దయ్యే వరకు వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఎటు వెళ్తున్నారు? ఏం తింటున్నారు? దేనితో ఆడుతున్నారనేది ప్రతి క్షణం గమనిస్తూనే ఉండాలి. తల్లిదండ్రులు కేర్​ తీసుకుంటూనే పిల్లల ప్రొటెక్షన్​, సేఫ్టీ కోసం ప్రత్యేకంగా కొన్ని టూల్స్​, గాడ్జెట్స్​ వాడుకోవచ్చు. అలాంటి వాటిలో కొన్ని  ఇవి.

థర్మామీటర్​

నెలల వయసు ఉన్న పిల్లలకు కచ్చితంగా వేడి నీళ్లతోనే స్నానం చేయించాలని డాక్టర్లు చెప్తుంటారు. పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది. కాబట్టి నీళ్లు మరీ వేడిగా లేదా మరీ చల్లగా ఉండకూడదు. సరైన టెంపరేచర్​లో నీళ్లు ఉన్నాయా? లేవా? అని తెలుసుకునేందుకు గాడ్జెట్​ ఒకటి ఉంది. బాతు బొమ్మలా ఉండే ఈ బీఅండ్​హెచ్​ కంపెనీ థర్మామీటర్​ను నీళ్లలో వేస్తే నీళ్లు ఎంత వేడిగా ఉన్నాయో చూపిస్తుంది. ఫారెన్‌‌‌‌హీట్, సెల్సియస్ రెండింటిలోనూ టెంపరేచర్​ చూడొచ్చు. అంతేకాదు.. దీన్ని డిజిటల్​ క్లాక్​లా కూడా వాడుకోవచ్చు. ఇందులో టెంపరేచర్​ అలారం కూడా ఉంటుంది. నీళ్లలో ఈ బాతు బొమ్మను వేసినప్పుడు టెంపరేచర్​ మరీ ఎక్కువగా ఉన్నా.. మరీ తక్కువగా ఉన్నా అలారం మోగుతుంది.  దీన్ని బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్​తో తయారుచేశారు. రెండు ఎల్​ఆర్​44  బ్యాటరీలతో పనిచేస్తుంది.

 ‌‌‌‌‌‌‌‌– ధర 3,877 రూపాయలు

హెడ్​ ప్రొటెక్టర్​ 

నడక వచ్చాక పిల్లలను పట్టుకోవడం చాలా కష్టం. పైగా గోడలను పట్టుకుని లేచి నిల్చోవడానికి ట్రైచేస్తూ.. చాలాసార్లు కింద పడతారు. అలా పడినప్పుడు తలకు దెబ్బలు తగలకుండా హెడ్​ ప్రొటెక్టర్ ప్యాడ్​ వాడాలి. ఇలాంటి ప్యాడ్స్​ను చాలా కంపెనీలు మార్కెట్​లోకి తెచ్చాయి. ఈ ప్యాడ్​లో సాఫ్ట్ ఫ్యాబ్రిక్​ని నింపుతారు. అందువల్ల పిల్లలకు కిందపడినా దెబ్బ తగలదు. భుజానికి తగిలించేలా అడ్జెస్టబుల్​ పట్టీలు కూడా ఉంటాయి. 

ధర: 400 రూపాయల నుంచి మొదలు

బేబీ డోమ్ 

పిల్లలు పాకడం మొదలుపెడితే వాళ్లను ఆపడం చాలా కష్టం. నేలపై ఏం కనిపించినా వదలరు. అలాంటి పిల్లల కోసం బెస్ట్​ ప్రొడక్ట్ బేబీ డోమ్​. ఫిషర్​– ప్రైస్​ అనే కంపెనీ దీన్ని తయారుచేసింది.  ఇది 2-ఇన్-1 పోర్టబుల్ ఇన్​ఫాంట్​ ప్లే స్పేస్​లా పనిచేస్తుంది. అంతేకాదు.. పిల్లలకు ఇది న్యాపింగ్ స్పాట్ కూడా. ఇంట్లో ఉన్నప్పుడు లేదా బయటికి వెళ్లినప్పుడు దీన్ని మీ వెంట తీసుకెళ్లడం బెస్ట్​ ఛాయిస్​. దీని లోపల మెత్తని పరుపు ఉంటుంది. దీని మీద ఉండే డోమ్​ సూర్య కిరణాల నుంచి కాపాడుతుంది. పిల్లలు ఆడుకునేందుకు రెండు బొమ్మలు కూడా వేలాడుతుంటాయి. ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఫోల్డ్​ చేసి, ఈజీగా పట్టుకెళ్లొచ్చు. 

ధర: 25,153 రూపాయలు

ఫార్ములా మిల్క్ మిక్సర్​ 

ఈ మధ్య చాలామంది పిల్లలకు తల్లి పాలతో పాటు ఫార్ములా మిల్క్​ కూడా పట్టిస్తున్నారు. కానీ.. తాగించిన ప్రతిసారి నీళ్లు వేడి చేసి, సరిగ్గా కొలత తీసుకుని రెండింటిని కలపడం కాస్త కష్టమే. అందుకే అలాంటి తల్లుల కోసం ఫార్ములా మిల్క్​ పౌడర్​, వేడి నీటిని కలిపి పాలను తయారుచేసే మెషిన్​ని బేబీ బ్రెజ్జా అనే కంపెనీ తీసుకొచ్చింది. దీన్ని బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్​తో తయారుచేశారు. మెషిన్​లోని ఒక కంపార్ట్​మెంట్​లో  మిల్క్​ పౌడర్​, మరో కంపార్ట్​మెంట్​లో నీళ్లు పోస్తే పాలు రెడీ అయి బయటకు వచ్చేస్తాయి.

ధర: 43,000 రూపాయలు