
ఎల్బీనగర్, వెలుగు : మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హార్డ్ వేర్ పార్క్ లోని ఓ కంపెనీలో మంటలు ఎగిసి పడ్డాయి. కంపెనీలోని ఒకటో నెంబర్ యూనిట్లో మంటలు చెలరేగి, చుట్టూ వ్యాపించాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీ లోపల 50 మంది సిబ్బంది ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.