నాలుగు అంతస్తుల బిల్డింగ్ వరదల్లో కొట్టుకుపోయింది

నాలుగు అంతస్తుల బిల్డింగ్ వరదల్లో కొట్టుకుపోయింది

సిమ్లా: భారీ వర్షాల కారణంగా ఉత్తరాది రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. వరదల కారణంగా రవాణా మార్గాలు దెబ్బతినడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల్లో ఇళ్లు మునిగిపోతుండటంతో పెద్ద ఎత్తున ప్రజలు నిరాశ్రయులవుతున్నారు. తాజాగా సిమ్లాలోని చోపాల్ పట్టణంలో ఓ నాలుగు అంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. అనంతరం వరదల్లో కొట్టుకుపోయింది. అయితే అంతకు ముందే అధికారులు ఈ బిల్డింగ్ ను ఖాళీ చేయించారు. దీంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. ఇప్పుడు ఆ బిల్డింగ్ కొట్టుకుపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు ఏ రేంజ్ లో కురుస్తున్నాయో ఈ వీడియోను చూస్తే అర్థమవుతుంది. ఇక దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా ప్రభుత్వాలు ప్రజలను హెచ్చరించాయి.