బడ్జెట్ సమయంలో సరదా సన్నివేశం

బడ్జెట్ సమయంలో సరదా సన్నివేశం

పార్లమెంట్‌లో కేంద్రఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగిస్తున్న సమయంలో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. తుక్కు విధానం గురించి నిర్మల ప్రకటన చేస్తూ పొల్యూటెడ్‌ వెహికల్‌ అనబోయి.. పొలిటికల్‌ అని పలికారు. దీంతో అధికార సభ్యులతో పాటు, విపక్ష సభ్యులు కూడా ఒక్కసారిగా నవ్వారు. దీంతో సభలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. పొరపాటును గ్రహించిన నిర్మలా సీతారామన్‌ సైతం నవ్వుతూ తప్పును సవరించుకుని తన ప్రసంగాన్ని కొనసాగించారు.ః

బడ్జెట్ పదనిసలు 

* గత రెండేళ్లుగా డిజిటల్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్ 

* ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మాల సీతారామన్

*  ఈ రోజు బడ్జెట్ ట్యాబ్‌తో ఎరుపు రంగు చీరలో కనిపించారు

* బడ్జెట్ చదువుతున్న సమయంలో అప్పుడప్పుడు మంచీనీళ్లు తాగారు

* కొన్ని శాఖలకు అధిక నిధులు కేటాయించామని ప్రకటించిన సందర్భంలోనూ అధికార సభ్యులు (ఎన్ డీఏ కూటమి సభ్యులు) హర్షం వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. అయినా నిర్మలమ్మ ఎక్కడా ఆగలేదు. బడ్జెట్ చదువుకుంటూ వెళ్లారు.

నిర్మలమ్మకు.. ఐదో బడ్జెట్‌

ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఐదోసారి. ప్రస్తుత ప్రభుత్వానికి పూర్తిస్థాయి చివరి బడ్జెట్‌ ఇదే. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అప్పుడు ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు.

ఈసారీ.. కాగితరహిత బడ్జెట్టే..

కరోనా దృష్ట్యా గత రెండేళ్లుగా కాగిత రహిత బడ్జెట్‌నే ప్రవేశపెడుతున్నారు. అదే సంప్రదాయాన్ని ఈసారి కూడా కొనసాగించారు. బడ్జెట్‌ ట్యాబ్‌ను ఎరుపు రంగు పౌచ్‌లో ఉంచి తీసుకొచ్చారు. ప్రజలు, ఎంపీలకు బడ్జెట్‌ వివరాలు అందుబాటులో ఉంచేందుకు యూనియన్‌ బడ్జెట్‌ మొబైల్‌ యాప్‌ను తీసుకొచ్చారు.