తెలంగాణాలో బ్రాండెడ్ కంపెనీల పేరిట డూప్లికేట్ టీవీల విక్రయం

తెలంగాణాలో బ్రాండెడ్ కంపెనీల పేరిట డూప్లికేట్ టీవీల విక్రయం

బ్రాండెడ్ కంపెనీల పేరిట డూప్లికేట్ టీవీలు విక్రయిస్తున్న ముఠాను వికారాబాద్ జిల్లా నవాబ్ పేట పోలీసులు గుట్టురట్టు చేశారు. నవాబ్ పేట మండలం పులుమామిడి దగ్గర వాహనాల తనిఖీలు చేస్తుండగా వీరిని పట్టుకున్నారు. మొత్తం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. వీరి వద్ద నుంచి 71 నాసిరకం టీవీలు, సోనీ టీవీ బ్రాండెడ్ స్టిక్కర్స్, ఒక కారు, ఒక వ్యాన్ సహా 7 య్యాక్టివా వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ముఠా డూప్లికేట్ టీవీలకు బ్రాండెడ్ కంపెనీల స్టికర్లు వేసి గ్రామాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. గతంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విక్రయాలు కొనసాగించిన ముఠా, ఇప్పుడు తెలంగాణలోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. వీరు ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో కూడా పోలీసులు రుజువు చేసి చూపించారు. మీడియా సమావేశంలో ఈ ముఠా సభ్యులు ఆండ్రాయిడ్ టీవీని సోనీ కంపెనీ సాప్ట్ వేర్ వేసి 10సెకన్లలో సోనీ కంపెనీ టీవీగా మార్చారు. ఢిల్లీలో ఉండే పవన్ శర్మ, సలీంలు ఈ ముఠా సభ్యులను గ్రామాల్లోకీ పంపి విక్రయాల కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.