మున్సిపల్ పాఠశాలలో గ్యాస్ లీక్ : 24 మంది విద్యార్థులకు అస్వస్థత

మున్సిపల్ పాఠశాలలో గ్యాస్ లీక్ : 24 మంది విద్యార్థులకు అస్వస్థత

ఢిల్లీలోని నరైనా ప్రాంతంలోని మున్సిపల్ పాఠశాలలో శుక్రవారం (ఆగస్టు 11న) గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో 24 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే 19 మంది విద్యార్థులను రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు.  

తొమ్మిది మంది విద్యార్థులను దగ్గరలోని ఆచార్య శ్రీ భిక్షు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అస్వస్థతకు గురైన విద్యార్థులందరూ ప్రస్తుతం క్షేమంగానే ఆస్పత్రిలో ఉన్నారని అధికారులు తెలిపారు. పాఠశాల సమీపంలో గ్యాస్ లీక్ కావడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని చెప్పారు.