కేఫ్ బయట హనుమాన్ చాలీసా పారాయణం..వీడియో వైరల్

కేఫ్ బయట హనుమాన్ చాలీసా పారాయణం..వీడియో వైరల్

ప్రస్తత కాలంలో యువత సినిమా పాటలు..వెస్ట్రన్ మ్యూజిక్ అంటే పడిచచ్చిపోతారు. వాటినే హమ్ చేస్తుంటారు. ముఖ్యంగా పాప్ సాంగ్స్ తో పాటు..హిందీ గీతాలను వీలుదొరికినప్పుడల్లా ఆలపిస్తుంటారు. కానీ యువత భక్తి పాటలు పాడటం చాలా అరుదు. అదీ బహిరంగ ప్రదేశాల్లో దేవున్ని కీర్తించే ..ప్రార్థించే పాటలు పాడమంటే తెల్లమొహం వేస్తారు. కానీ గురుగ్రామ్లో కొందరు యువకులు మాత్రం భక్తి పాటలతో ఆకట్టుకున్నారు. కేఫ్ బయట కొందరు అబ్బాయిలు, అమ్మాయిలు హనుమాన్ చాలీసా పాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

హర్యానాలోని  గురుగ్రామ్‌లోని  కాఫీ గీవ్ యు వింగ్ అనే ఒక కేఫ్ బయట కొందరు అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. చప్పట్లు కొడుతూ భక్తి గీతాన్ని ఆలపించారు. ఇందులో ఇద్దరు యువకులు గిటార్ ప్లే చేయగా..ఒకరు ఢోలక్ వాయించారు. ఇతరులు బీట్‌కు తగ్గట్లు చప్పట్లు కొడతూ హనుమాన్ చాలీసా పఠించారు. వీరందరూ ప్రతీ మంగళవారం కేఫ్ బయట హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారట.  

మూడు నిమిషాల 11 సెకన్లు ఉన్న ఈ వీడియా ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ఈ వీడియో 24.7K కంటే ఎక్కువ లైక్‌ చేశారు. 760K కంటే ఎక్కువ మంది వీక్షించారు. హనుమాన్ చాలీసా అనేది హనుమంతునికి అంకితం చేయబడిన భక్తి గీతం. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల చెడు శక్తి తొలగిపోయి అదృష్టం కలుగుతుందని నమ్ముతారు.