'మహా' పాలిటిక్స్.. గుజరాత్ టూ అస్సాం

'మహా' పాలిటిక్స్.. గుజరాత్ టూ అస్సాం

మహారాష్ట్రలో ఉద్ధవ్‌ ఠాక్రే  ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసిన ఏక్ నాథ్ షిండే.. రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి అస్సాంకు చేరుకున్నారు. మంగళవారం సూరత్‌లోని లీ మెరిడియన్ హోటల్‌లో బస చేసిన  ఏక్‌నాథ్ షిండే, ఇతర తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ మకాన్ని అస్సాంకు మార్చారు.

బుధవారం తెల్లవారుజామున గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్‌కు మహారాష్ట్ర ఎమ్మెల్యేల బృందం చేరుకుంది.

గౌహతి విమానాశ్రయానికి చేరుకున్న ఏక్‌నాథ్‌ షిండే.. తన వెంట మొత్తం 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రకటించారు.  ఈ సందర్భంగా బాలాసాహెబ్‌ ఠాక్రే కోరుకున్న హిందుత్వను కొనసాగిస్తామని ఏక్ నాథ్ షిండే స్పష్టం చేశారు.

అటు ఎయిర్ పోర్టులో రెబల్ ఎమ్మెల్యేలకు  బీజేపీ ఎమ్మెల్యే సెశాంతా బెర్గొహైన్‌ స్వాగతం పలికాడు.  వ్యక్తిగత సంబంధాలతో  శివసేన ఎమ్మెల్యేలను రిసీవ్ చేసుకోవడానికి మాత్రమే వచ్చానని సుశాంత బోర్గోహైన్ తెలిపారు. అయితే ఎంత మంది ఎమ్మెల్యేలు వచ్చారో తనకు తెలియదన్నారు.