రేవంత్ వల్లే రాజీనామా చేస్తున్నం: కాంగ్రెస్ నాయకులు

రేవంత్ వల్లే రాజీనామా చేస్తున్నం: కాంగ్రెస్ నాయకులు

పద్మారావునగర్, వెలుగు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడలతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ కు నష్టం జరుగుతోందని సనత్ నగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. తాము కాంగ్రెస్​ కు గుడ్ బై చెబుతున్నామని, త్వరలో మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి నాయకత్వంలో  బీజేపీలో చేరుతామని ప్రకటించారు. ఈమేరకు పద్మారావునగర్ కాంగ్రెస్​ ప్రెసిడెంట్ గుంటి సత్యనారాయణ 20 మంది నాయకులు, పలువురు కార్యకర్తలు బేగంపేట లోని కాంగ్రెస్ ఆఫీసుకు వెళ్లి మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేశారు. 

దశాబ్దాలుగా పార్టీకి సేవలంందిస్తున్న సీనియర్ నాయకులకు కనీసం గౌరవం ఇవ్వకుండా అహంకారపు మాటలతో రేవంత్ అవమానించాడని అన్నారు. తమ నేత మర్రి శశిధర్ రెడ్డి నాయకత్వంలో త్వరలో బీజేపీలో చేరుతామని వారు తెలిపారు. రాజీనామా చేసిన వారిలో దొడ్డె సురేశ్, సగత్​ వాళ్ వంశీ, విజయ్​ కుమార్, కృష్ణవేణి, రాజీవ్ దేశ్ పాండే, మంచాల గోపి, చంద్రపాల్ రెడ్డి, బొజ్జ నర్సింగ్ రావు, మరియా, నగేశ్ రెడ్డి, బాబురావు, గుండ్రం మల్లేశ్, నరేందర్​, శ్రీకాంత్ రెడ్డి, సందీప్ ఆనంద్, అనిత, మాధవి, పార్శీ పరమేశ్ తదితరులు ఉన్నారు.