నాగ చైతన్య NC22లో కీలక నటులు

నాగ చైతన్య NC22లో కీలక నటులు

టాలీవుడ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో సినిమా చేస్తున్నాడు. NC 22 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భారీ తారాగణం నటించబోతోంది. నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్‌ గా నటిస్తోంది. గత కొద్దిరోజులుగా ఈ చిత్రం నుండి మేకర్స్ వరుసగా అప్ డేట్స్ ఇస్తున్నారు. మూవీకి సంబంధించిన నటీనటుల వివరాలను చిత్ర బృందం ప్రకటిస్తోంది. నాగ చైతన్య కెరీర్ లో భారీ బడ్జెట్ గా చిత్రం తెరకెక్కబోతోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న సినిమాలో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన సుప్రీం టాలెంటెడ్ అరవింద్ స్వామి, శరత్ కుమార్, నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ న‌టి ప్రియమణీ, వెర్సటైల్ యాక్టర్ సంపత్ రాజ్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  

ప్రేమ్‌జీ అమరెన్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ లు కీలక పాత్రలు పోషిస్తారని చిత్ర బృందం వెల్లడించింది. అలాగే బుల్లి తెరపై సంచలనం సృష్టించిన ‘కార్తీక దీపం’ ఫేమ్ ‘దీప అలియాస్ వంటలక్క కీలక పాత్ర పోషించనున్నారు. దీప అసలు పేరు ప్రేమి విశ్వనాధ్. కార్తీక దీపం సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.  ఈ చిత్రానికి.. మాస్ట్రో ఇళయరాజాతో పాటు ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా కూడా సంగీతాన్ని సమకూరుస్తున్నారు.