జనవరి 10 నుంచి దేవరకొండలో కబడ్డీ టోర్నమెంట్ : సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ చంద్రయ్య

జనవరి  10 నుంచి దేవరకొండలో కబడ్డీ టోర్నమెంట్ :  సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ చంద్రయ్య

దేవరకొండ, వెలుగు:  దేవరకొండ  నియోజకవర్గ స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ చంద్రయ్య సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గ స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌నుఈ నెల 10, 11, 12 తేదీల్లో దేవరకొండ పట్టణంలోని గవర్నమెంట్ హైస్కూల్ మైదానం లో నిర్వహించనున్నట్లు చెప్పారు. 

ఈ పోటీలకు నేనావత్ అభిలాష్ నాయక్ ఛాలెంజర్ ట్రోఫీ అనే పేరును నిర్ణయించినట్లు, ఈ టోర్నమెంట్‌లో దేవరకొండ నియోజకవర్గానికి చెందిన 8 మండలాల పరిధిలోని అన్ని గ్రామాల నుంచి కబడ్డీ జట్లు పాల్గొననున్నాయన్నారు. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే అందరు క్రీడాకారులకు ప్రత్యేక డ్రెస్‌లు, విజేత జట్లకు నగదు ప్రోత్సాహకాలు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.