లంక బోర్డును పునరుద్ధరించిన కోర్టు

లంక బోర్డును పునరుద్ధరించిన కోర్టు

కొలంబో :  శ్రీలంక క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ) వ్యవహారంలో కీలక మార్పు చోటు చేసుకుంది. బోర్డును రద్దు చేస్తూ ఆ దేశ క్రీడల మంత్రి రోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రణసింఘే తీసుకున్న నిర్ణయాన్ని అప్పీళ్ల కోర్టు 14 రోజుల పాటు సస్పెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. దీంతో ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షమ్మీ సిల్వా నేతృత్వంలోని బోర్డు యధావిధిగా కార్యకలాపాలు జరిపేందుకు మార్గం సుగమమైంది. రణసింఘే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిల్వా మంగళవారం కోర్టును ఆశ్రయించాడు.

దీనిపై విచారణ జరిపిన కోర్టు పైవిధంగా తీర్పు ఇచ్చింది. మేలో లంక బోర్డు ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎన్నికైన సిల్వా పదవీకాలం 2025 వరకు ఉంది. రణసింఘే ఏర్పాటు చేసిన రణతుంగ కమిటీ సభ్యుల బృందం సోమవారం బోర్డును సందర్శించింది.