పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకతలివే!

పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకతలివే!

హై టెక్నాలజీతో హైదరాబాద్ లో రూ. 600 కోట్లతో పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని నిర్మించారు. 20 అంతస్తులున్న టవర్‌ ఏలోని 18వ అంతస్తులో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఏడెకరాల స్థలంలో అత్యాధునిక పరిజ్ఞానంతో కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ఏర్పాటైంది. సాంకేతికతను జోడిస్తూ ఒకే చోట నుంచి నగరమంతా వీక్షించేలా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించారు. దేశంలోని అన్ని శాఖలను ఇంటిగ్రేటెడ్ చేస్తూ ఆరు వందల కోట్ల రూపాయలతో 18 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. రాష్ట్రంలోనూ సీసీటీవీ అనుసంధానమైన ప్రదేశాలను చిటికలో చూడొచ్చు. 

సీసీసీ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం..

*  కమాండ్ కంట్రోస్ సెంటర్( సీసీసీ ) నుంచి  రాష్ట్రంలో ఏం జరుగుతుందో సెకన్లలోనే తెలుస్తుంది
*ఎక్కడ దొంగతనం జరిగిందో.. అతడు డ్రైవింగ్ చేస్తున్న వెహికిల్ ఆధారంగా సీసీటీవీ పుటేజీతో నిమిషాల్లోనే దొంగను పట్టుకోవచ్చు
*స్టేట్ వైడ్ గా వర్షాలు ఎక్కడ పడుతున్నాయో తెలుసుకోవచ్చు. 
*బ్రహ్మోత్సవాలు, బోనాలకు సంబంధించిన అప్డేట్స్ ఇక్కడి నుంచే చూడొచ్చు.
* గణేష్ నిమజ్జనాలు, రాజకీయ సభలు, ప్రమాదాలు ఇలాంటి ఎన్నో దృశ్యాలు చూసి అలెర్ట్ అయ్యేందుకు ఎంతో ఉపయోగం
 *వరదలు, ప్రాజెక్టులు, GHMC పైప్ లైన్ వేసే సమయంలో ఎక్కడ పనులు జరుగుతున్నాయో తెలుసుకోవచ్చు.  
* లైవ్ కార్యక్రమాలను చిటికలో తెలుసుకోవచ్చు
* పోలీస్ అధికారులు, స్టాఫ్ ఎలా పని చేస్తున్నారో చూడొచ్చు
* అనుమానిత వ్యక్తులను ఆరా తీయొచ్చు
* ఒకేసారి లక్ష సీసీటీవీ కెమెరాలు వీక్షించేలా కేంద్రం ఏర్పాటు.
*ఈ కేంద్రం నుంచి అన్నిశాఖలకు కనెక్షన్.
* రాష్ట్రవ్యాప్తంగా ఏ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సీసీటీవీ కెమెరా దృశ్యాలైనా సరే హైదరాబాద్‌లో ఉన్న ఈ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి వీక్షించవచ్చు.
* అన్ని జిల్లాలు, పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోని సీసీటీవీ కెమెరాలు ఆయా జిల్లా కేంద్రాల్లోని మినీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లకు అనుసంధానం
 *పోలీస్ స్టేషన్ల ఫీడ్‌ను డైరెక్ట్ గా సీసీసీకి జోడించారు.
* హైదరాబాద్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డులోని సీసీటీవీ కెమెరాలు, మెట్రోస్టేషన్ల పరిధిలోని సీసీటీవీ కెమెరాల ఫీడ్‌ను సీసీసీతో లింక్

*లాబ్‌.. క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ సిస్టం 

FIR మొదలు.. కేసు స్థితిగతుల పరిశీలన, నేరాలు జరిగే ప్రాంతాల క్రైమ్‌ మ్యాపింగ్, నేరగాళ్ల డేటాబేస్‌ నిర్వహణ,  అధ్యయనం, జైలు నుంచి విడుదలయ్యే నేరగాళ్లపై పర్యవేక్షణ, డిజిటల్‌ ఇన్వెస్టిగేషన్‌ లాబ్‌ ఇతర టూల్స్‌ నేరాల నిరోధం, కేసుల సత్వర పరిష్కారానికి ఉపయోగపడనుంది.

*సిటిజన్‌ పిటిషన్‌ మేనేజ్‌మెంట్‌..

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని విభాగాల వారీగా కేటాయిస్తారు, సత్వర స్పందన, పరిష్కారం జరుగుతుంది. వీటి మ్యాపింగ్‌ మొత్తం కంప్యూటర్‌ ద్వారా జరుగుతుంది. మార్కెట్, సోషల్‌ మీడియా విశ్లేషణ, మెబైల్‌ యాప్స్‌ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఉంది. పలు ప్రాంతాల్లో  ఉండే సీసీ కెమెరాల్లో రికార్డు అవుతున్న దృశ్యాలను పెద్ద వీడియో వాల్‌ సాయంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. స్పెషల్ ఎనలటిక్స్‌గా పిలిచే సాఫ్ట్‌వేర్స్‌ తో శాంతిభద్రతల పరిస్థితుల్ని అంచనా వేస్తారు. GPS టెక్నాలజీ వాహనాలను అవసరమైన చోటుకు మళ్ళిస్తారు.

*ట్రాఫిక్‌ కష్టాలకు చెక్​..
సిటీలో ట్రాఫిక్‌ నిర్వహణకూ హై టెక్నాలజీ వాడనున్నారు. సెన్సర్లతో పలు మార్గాల్లో ట్రాఫిక్‌ను అధ్యయనం చేసి, మార్పు చేర్పులు సూచిస్తారు. ఆర్టీఏ డేటాబేస్‌ ..అనుమానిత వాహనాల డేటాబేస్‌ లను అనుసంధానిస్తారు. తక్షణ రిప్లై  కోసం ఇన్సిడెంట్‌ మేనేజ్‌మెంట్‌ టూల్స్‌ ఉంటాయి.

*నేరగాళ్ల కదలికల్ని గుర్తించే సాఫ్ట్‌వేర్‌..

నేరాలను పసిగట్టే, నేరగాళ్ల కదలికల్ని గుర్తించే సాఫ్ట్‌వేర్‌ ఎనలటికల్‌ టూల్స్‌ అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు డేటా ఎనాలసిస్, అడ్వాన్స్‌ సెర్చ్‌కూ టెక్నాలజీ వాడనున్నారు. ఎక్స్ ట్రా స్పెషల్ వెబ్‌ డిజైనింగ్‌ టూల్స్‌తో మెరుగైన సేవలు అందించనున్నారు.