నకిలీ ఆలుగడ్డలా.. ఇవి కూడా వచ్చేసాయా.. ఎలా గుర్తించాలంటే..

నకిలీ ఆలుగడ్డలా.. ఇవి కూడా వచ్చేసాయా.. ఎలా గుర్తించాలంటే..

ఇప్పుడు పండ్లు, ప్యాక్ చేసిన ఫుడ్స్/స్నాక్స్ మాత్రమే కాదు.. బంగాళాదుంపలు వంటి కూరగాయలను కూడా కలుషితం అవుతున్నాయి. ఈ రోజుల్లో నకిలీ/రసాయనికంగా పండించిన బంగాళాదుంపలు అమ్ముడవుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇది ప్రతి కొనుగోలుదారులు, కూరగాయలు కొనేవారు, తినేవారు పరిగణించవలసిన అతి ముఖ్యమైన, జాగ్రత్త వహించాల్సిన విషయం....  

ఈ నకిలీ బంగాళాదుంపలు ఎక్కువగా విషపూరిత రసాయనాలు లేదా కృత్రిమ పూతతో ఉంటాయి, అంటే అవి పైకి ఫ్రెష్ గా లేదా  సహజంగా పండించినట్లు కనిపిస్తాయి. అవి తాజాగా స్వచమైనవిగా కనిపించినప్పటికీ వాటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు, అలెర్జీలు లేదా మీ శరీర అవయవాలకు హాని కలిగించవచ్చు. 

నకిలీ బంగాళాదుంపలను ఎలా గుర్తించాలి:
మీరు కొనే బంగాళాదుంపలు నిజమైనవో కాదో చెక్ చేయడానికి  కొన్ని సులభమైన పద్ధతులు ఉన్నాయి:
*వాసన చూడండి: నిజమైన బంగాళాదుంపలు సహజమైన మట్టి వాసన వస్తుంటుంది. మీరు పట్టుకున్న బంగాళాదుంపలు రసాయనాల వాసనతో ఉంటే లేదా ఏదైనా కృత్రిమ సువాసన ఉంటే అదొక హెచ్చరిక సంకేతం.  
*లోపల, బయట రంగును చెక్ చేయండి: బంగాళాదుంపలను ముక్కలుగా కోయండి. ఎందుకంటే  సాధారణ బంగాళాదుంపలలో లోపల & బయట ఒకే రంగు, సహజ ఆకృతి ఉంటుంది. లోపల రంగు మారిన, తేడాగా ఉన్న లేదా వింతగా అనిపించినా జాగ్రత్త పడాల్సిందే.   
*రబ్-ఆఫ్ టెస్ట్: బంగాళాదుంప పైన లైట్ గా రుద్దండి లేదా పైన కొంత భాగాన్ని తొక్క తీయండి. మీ చేతిపై లేదా చేతికి రంగు లేదా పూత ఈజీగా రాలిపోతే అనుమానించాల్సిందే. 
*నీటి పరీక్ష: ఒక గిన్నెలో నీళ్లు పోసి నింపి బంగాళాదుంపలు వేయండి. అసలైనవి, సహజంగా పండించినవి బరువుకి ఇంకా సాధారణంగా మునిగిపోతాయి. నకిలీవి, రసాయనికంగా పండించినవి లేదా బరువు లేకుండా ఉన్నవి పైకి తేలుతాయి. 
*బంగాళాదుంప తొక్క, ఆకారం చెక్ చేయండి: నిజమైన బంగాళాదుంపలు సాధారణంగా కొంచెం గరుకుగా, పలుచగా ఉండే తొక్కతో  ఉంటాయి, మీరు దానిని స్క్రబ్ చేయాల్సి ఉంటుంది. తొక్క అసహజంగా నునుపుగా, మందంగా ఉంటే లేదా చాలా తేలికగా రాలిపోతే    వాటిని కెమికల్స్ లేదా రసాయనాలుతో పండించారని అర్ధం చేసుకోవచ్చు.  

నకిలీ లేదా కలుషితమైనవి అని అనుమానం వస్తే ఎం చేయాలి?
* నమ్మకమైన విక్రేతల నుండి లేదా మీకు నమ్మకం ఉన్న వారి దగ్గరనే కూరగాయలు కొనండి.
*బంగాళాదుంపలు చాలా బాగా కనిపిస్తే ఉదాహరణకు అసాధారణంగా, అతి శుభ్రంగా, ప్రకాశవంతంగా, మంచి గుండ్రటి ఆకారంలో ఉంటే   జాగ్రత్తగా పరిశీలించండి, అనుమానం వస్తే ప్రశ్నించండి. 
*వంట చేసే ముందు బాగా కడిగి తొక్క తీయండి. డౌట్ ఉంటే లేదా ఆరోగ్యానికి హాని అనిపిస్తే వాటిని పారవేయండి.
*ఎక్కువ మందికి ఈ విషయాన్ని అంటే కుటుంబ సభ్యులకు / స్నేహితులకు చెప్తూ అవగాహన పెంచండి. 

ఆహార భద్రత గురించి అవగాహన ఎందుకు: 
మనమందరం ప్రతిరోజు ఆహారం కోసం బంగాళాదుంపలు వంటి సాధారణ కూరగాయలు కొంటుంటాము. కానీ కొన్ని అంశాలు చెడిపోయినప్పుడు వాటి ప్రభావాలు లేదా ప్రమాదాలు నేడు కనిపించకపోవచ్చు కానీ తరువాత బయటపడతాయి. ఒక క్షణం ఆగి కొనేముందు ఈ పరీక్షలు/ జాగ్రత్తలు పాటించడం ద్వారా మీరు స్వచ్ఛమైన కూరగాలతో మంచి ఆరోగ్యన్ని ఇంటికి తీసుకెళ్తారు.