నిమ్స్ లో రోజుకు 3వేల టెస్టులు చేసే మెషీన్

నిమ్స్ లో రోజుకు 3వేల టెస్టులు చేసే మెషీన్

హైదరాబాద్‌‌, వెలుగు : నిమ్స్ లో రోజుకు 3 వేల కరోనా టెస్టులు చేసే కెపాసిటీ ఉన్న కొత్త మెషీన్ ను బుధవారం ఏర్పాటు చేశారు. కరోనా టెస్టుల సంఖ్య ను పెంచేందుకు అమెరికా నుంచి ‘కొబాస్‌‌ 8800’ అనే మెషీన్ ను హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు కొన్నారు. దీని కాస్ట్ రూ. 7 కోట్లు. మరో కోటి రూపాయలతో లాబొరేటరీని కూడా సిద్ధం చేశారు. వారం రోజుల్లో కొత్త మెషీన్ లో టెస్టులు షురూ అవుతాయని అధికారులు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,600 ఆర్‌‌టీపీసీఆర్‌‌ టెస్టులు చేస్తున్నారు. కొత్త మెషీన్ అందుబాటులోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 10 వేల కరోనా టెస్టులు చేయవచ్చు.