మల్కాజిగిరిలో తప్పిన పెను ప్రమాదం...గౌతమ్ నగర్ లో గుట్ట పైనుంచి జారి పడిన బండరాయి

మల్కాజిగిరిలో  తప్పిన పెను ప్రమాదం...గౌతమ్ నగర్ లో గుట్ట పైనుంచి జారి పడిన బండరాయి

మల్కాజిగిరి గౌతమ్​నగర్​లో గురువారం గుట్ట పైనుంచి పెద్ద బండరాయి జారి పడింది. జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బుధవారం ఈదురుగాలులు, జల్లులతో బండ కింద మట్టి కరిగి జారిపడినట్లు స్థానికులు చెబుతున్నారు. 

అది అమాంతం పక్కనే రోడ్డుపై ఉన్న మున్సిపల్​ఆటోపై పడడంతో.. ఆ వాహనం నుజ్జునుజ్జయింది. సమాచాం అందుకున్న హైడ్రా డీఆర్​ఎఫ్, జీహెచ్ఎంసీ  సిబ్బంది బండను ముక్కలుగా చేసి తొలగించారు.