బోర్ వెల్ లారీని ఢీకొని యువకుడు మృతి ..రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌‌లో ఘటన

బోర్ వెల్ లారీని ఢీకొని యువకుడు మృతి ..రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌‌లో ఘటన

ముస్తాబాద్, వెలుగు: రోడ్డు పక్కన నిలిపి ఉంచిన బోర్‌‌‌‌వెల్‌‌ లారీని బైక్  ఢీకొనడంతో యువకుడు మృతిచెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ముస్తాబాద్ మండల కేంద్రంలోని అయ్యప్ప టెంపుల్ సమీపంలో ఓ బోర్ వెల్ లారీ నాలుగైదు రోజుల కింద పార్కింగ్ చేశారు. శనివారం రాత్రి పోతుగల్ గ్రామానికి చెందిన కొప్పు నరేశ్(27) పెట్రోల్ తీసుకుని తిరిగి బైక్ పై వెళ్తున్నాడు. బోర్ వెల్ లారీని గమనించకపోవడంతో వెళ్లి బైక్ తో ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని108లో సిద్దిపేటలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ప్రమాదానికి కారణమైన బోర్ వెల్ లారీని స్టేషన్ తరలించారు. మృతుడి తండ్రి రవి ఫిర్యాదుతో ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ గణేశ్​తెలిపారు.