లవ్ ఫెయిల్యూర్, సినిమాలో చాన్స్ రాలేదని..ట్రాన్స్ ఫార్మర్ పట్టుకున్న యువకుడు

లవ్ ఫెయిల్యూర్, సినిమాలో చాన్స్ రాలేదని..ట్రాన్స్ ఫార్మర్  పట్టుకున్న యువకుడు

కూకట్​పల్లి, వెలుగు: ప్రేమించిన యువతి తిరస్కరించడం, సినిమాల్లో నటించాలనే కోరిక తీరకపోవడంతో నిరాశతో ఓ యువకుడు సూసైడ్​ చేసుకున్నాడు. ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన గుడ్డేటి వేణు(25) కేపీహెచ్​బీ కాలనీలో నివసిస్తూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. మొదటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక ఉండడంతో సినిమా ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ప్రయత్నాలు చేశాడు. అవన్నీ విఫలమయ్యాయి. అదే సమయంలో తనకు పరిచయమైన యువతిని ప్రేమించాడు. అయితే, ప్రేమకు సదరు యువతి నో చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో హెచ్ఎంటీ శాతవాహననగర్​లోని చిల్ట్రన్​ పార్కు వద్దకు వెళ్లాడు. అక్కడి నుంచి తన ఫ్రెండ్స్, కొలీగ్స్​కు ఫోన్​ చేసి జీవితం మీద విరక్తి కలిగిందని, తాను చనిపోతున్నానని చెప్పాడు. కొందరు అతను చెప్పిన అడ్రస్​కు వెళ్లగా.. అప్పటికే ట్రాన్స్​ఫార్మర్​పట్టుకుని వేణు మృతి చెందాడు. ఈ ఘటనపై కూకట్​పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.