వ్యాక్సిన్ వద్దని పారిపోతుండగా పోలీసులు పట్టుకుని..

వ్యాక్సిన్ వద్దని పారిపోతుండగా పోలీసులు పట్టుకుని..

కరోనా నియంత్రణకు వ్యాక్సినేషనే కీలకమని హెల్త్ ఎక్స్ప్ పర్ట్స్ చెబుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉదృతి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. చాలా చోట్ల వ్యాక్సిన్ కోసం జనం క్యూ కడుతున్నారు. కొందరికి పొద్దంత లైన్లో ఉన్నా టీకా దొరకని పరిస్థితి నెలకొంది. టీకా కోసం చాలా మంది  ఎదురుచూస్తున్నారు. కానీ ఇంకా కొందరికి వ్యాక్సిన్ పై ఉన్న అపోహలు పోవడం లేదు. వ్యాక్సిన్ అంటే భయపడుతున్నారు. యూపీలోని కాస్ గంజ్ జిల్లాలో వ్యాక్సిన్ వేసుకోవడానికి జనం ముందుకు రావడం లేదు. టీకా వేసుకుంటే ఏమవుతుందోనని భయపడుతున్నారు. దీంతో పోలీసులే రంగంలోకి దిగి  వ్యాక్సిన్ వేయించాల్సిన పరిస్థితి వచ్చింది. కాస్ గంజ్ వీధుల్లో గురువారం అధికారులు ఓ వ్యక్తిని వ్యాక్సిన్ తీసుకోవాలని అడిగారు. దీంతో ఆ వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతన్ని పట్టుకుని వ్యాక్సిన్ సెంటర్ కు తీసుకొచ్చారు. ఇలా చాలామంది వారిని చూసి పారిపోతున్నారు. ఇప్పటికే కాస్ గంజ్ లోని పలు గ్రామాల్లో వ్యాక్సిన్ పై ఉన్న అపోహలపై జిల్లా మెజిస్ట్రేట్ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. చాలా మంది అధికారులు వ్యాక్సిన్ పై అపోహలను నివృత్తి చేస్తున్నారు. కానీ అక్కడున్న స్థానికులకు వ్యాక్సిన్ పై ఉన్న అపోహలు పోవడం లేదు.