చాట్‌‌జీపీటీతో స్పామర్లకు చుక్కలు.. బిజినెస్‌‌ మోడల్‌‌గా మార్చుకున్న యూఎస్‌‌ వ్యక్తి

చాట్‌‌జీపీటీతో స్పామర్లకు చుక్కలు.. బిజినెస్‌‌ మోడల్‌‌గా మార్చుకున్న యూఎస్‌‌ వ్యక్తి

చాట్‌‌జీపీటీతో స్పామర్లకు చుక్కలు

బిజినెస్‌‌ మోడల్‌‌గా మార్చుకున్న యూఎస్‌‌ వ్యక్తి

న్యూఢిల్లీ : యూఎస్‌‌కు చెందిన ఓ వ్యక్తి చాట్‌‌జీపీటీ సాయంతో  స్పామర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అంతేకాకుండా దీన్ని ఒక బిజినెస్‌‌ మోడల్‌‌గా మార్చి ఇతరులకు ఇలాంటి సర్వీస్‌‌లను ఆఫర్ చేస్తున్నాడు. కాలిఫోర్నియాకు చెందిన రోజర్ ఆండర్సన్‌‌ చాట్‌‌జీపీటీ బాట్‌‌ను, ఒక వాయిస్ క్లోనర్‌‌‌‌ (వాయిస్ మార్చే) ను వాడి టెలీమార్కెటింగ్ స్కామర్లు ఎక్కువ సేపు లైన్‌‌లో ఉండేలా చేస్తున్నాడు. జాలీ రోజర్ టెలిఫోన్ కంపెనీ ఇటువంటి స్పామర్ల టైమ్‌‌ను వేస్ట్ చేయడమే కాకుండా,  వారికి భారీగా నష్టవచ్చేలా చేస్తోందని వాల్‌‌ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఆండర్సన్‌‌ తన సరదా కోసం ఇది చేయడం లేదని, ఏడాదికి 25 డాలర్లకు ఈ సర్వీస్‌‌ను అందిస్తున్నాడని రిపోర్ట్ చేసింది. 

సబ్‌‌స్క్రిప్షన్ తీసుకున్నాక యూజర్‌‌‌‌ తన కాల్స్‌‌ను  ఒక యునిక్‌‌ నెంబర్‌‌‌‌కు ఫార్వార్డ్ చేసుకోవడానికి వీలుంటుంది. యూజర్‌‌‌‌కు ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది. దీనికి అదనంగా  యూజర్‌‌‌‌ ‘మెర్జ్‌‌’ అనే ఫీచర్‌‌‌‌ను ఎంచుకొని ఏం మాట్లాడుతున్నారో సీక్రెట్‌‌గా వినొచ్చు. వివిధ వాయిస్‌‌లు, బాట్ పర్సనాలిటీస్‌‌ ఈ సర్వీస్‌‌లో అందుబాటులో ఉంటాయి. కాలర్ డైరెక్ట్‌‌గా చాట్‌‌జీపీటీతో మాట్లాడలేడని, కానీ ‌‌బాట్‌‌ ఎనలైజర్‌‌‌‌ను వాడి కాలర్ ఏం మాట్లాడుతున్నాడో యూజర్‌‌ తెలుసుకోవచ్చని  వాల్‌‌స్ట్రీట్ వెల్లడించింది. ఆండర్సన్ తీసుకొచ్చిన చాట్‌‌జీపీటీ బాట్‌‌ మనుషులు మాట్లాడేలా సౌండ్స్  చేస్తుందని రిపోర్ట్ చేసింది. కానీ, చాట్‌‌జీపీటీ బాట్ మాట్లాడే వర్డ్స్ రిపీట్ అవ్వొచ్చని, కాలర్స్‌‌ కనిపెట్టే అవకాశం ఉందని వెల్లడించింది. 

చాట్‌‌జీపీటీ, వాయిస్‌‌ క్లోనర్ కలిసి స్పామర్లను కనీసం 15 నిమిషాల వరకు లైన్‌‌లో ఉంచగలవని వివరించింది. ముఖ్యంగా ఈ ఫీచర్లు క్రెడిట్‌‌ కార్డ్ స్కామ్స్‌‌ నుంచి యూజర్లను కాపాడతాయని పేర్కొంది. జాలీ రోజర్‌‌‌‌ కంటే ముందు లెన్నీ అనే చాట్‌‌బాట్ కూడా వచ్చింది. కానీ, సక్సెస్ కాలేకపోయింది.