
మెదక్ పట్టణంలో ఓ యువకుడు విద్యుత్ స్తంభం ఎక్కి హల్ చల్ చేశాడు. గాంధీ నగర్ కు చెందిన శేఖర్ ఎలక్ట్రిషియన్ గా చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే శేఖర్ కొద్దికాలం క్రితం ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో తన అత్తగారు బంగారం పెట్టలేదని కరెంటు స్తంభం ఎక్కాడు. బంగారం పెట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీన్ని గమనించిన స్థానికులు కరెంటు సరఫరాను నిలిపివేశారు. ఈ విషయం తెలుసుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, డి.ఎస్.పి, సీఐ ఘటన స్థలానికి చేరుకుని శేఖర్ కు బంగారం ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో దిగివచ్చాడు.