భూ వివాదం.. పోలీస్ స్టేషన్ ముందే సూసైడ్ అటెంప్ట్

V6 Velugu Posted on Sep 17, 2021

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం రామచంద్ర పల్లి గ్రామానికి చెందిన దోడ్డిండ్ల పోశెట్టి మాక్లూర్ పోలీస్ స్టేషన్  ఆవరణలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.  హెడ్ కానిస్టేబుల్ అప్రమత్తత వల్ల ప్రాణాపాయం తప్పింది. బాధితున్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రామచంద్ర పల్లి గ్రామంలో ఒక భూమి వివాదంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒక వర్గం వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోశెట్టి కొడుకును  పోలీసులు అరెస్టు చేశారు. దీంతో  పోలీస్ స్టేషన్ ఆవరణలో  పోశెట్టి ఆత్మహత్యాయత్నం చేశాడు.

Tagged NIzamabad, committed suicide, a man, premises, Maclure police station

Latest Videos

Subscribe Now

More News