హైదరాబాద్, వెలుగు: చిన్నారులకు అవసరమైన ప్రొడక్టులను ప్రదర్శించడానికి, అమ్మడానికి హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ నెల 20, 21 తేదీల్లో కిడ్స్ ఫెయిర్ జరగనుంది.
ఈ సందర్భంగా కిడ్స్ బిజినెస్ కార్నివాల్ కూడా నిర్వహిస్తారు. ఇందులో 60 మందికి పైగా బాల పారిశ్రామికవేత్తలు తమ వినూత్న ఆలోచనలను, ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. పిల్లలలో బిజినెస్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. 50కి పైగా ఎగ్జిబిటర్లు, 20 వేల మంది విజిటర్లు వస్తారని అంచనా.
