ఓటమి భయంతో పురుగుల మందు తాగిండు.. పోలింగ్ జరుగుతుండగా సర్పంచ్ అభ్యర్థి సూసైడ్ అటెంప్ట్

ఓటమి భయంతో పురుగుల మందు తాగిండు.. పోలింగ్ జరుగుతుండగా సర్పంచ్ అభ్యర్థి సూసైడ్ అటెంప్ట్

కాగ జ్ నగర్, వెలుగు: మూడో విడత సర్పంచ్​ ఎన్నికల పోలింగ్​ జరుగుతుండగా ఓ అభ్యర్థి ఓటమి భయంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం రాస్పల్లి గ్రామంలో జరిగింది. ఇక్కడ నలుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ఒకరైన బొమ్మెల్ల రాజన్న పోలింగ్​ మొదలైన కొద్దిసేపటికే పురుగుల మందు తాగడం గ్రామంలో కలకలం రేపింది. పోలింగ్​ సమయంలో ఇంటి దగ్గర దిగులుతో ఉన్న రాజన్న గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు, స్థానికులు హుటాహుటిన కాగజ్ నగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలుస్తానో.. లేదోనన్న భయంతో రాజన్న ఈ ఘటనకు పాల్పడ్డాడని ఆయన కొడుకు ప్రవీణ్ తెలిపారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రాజన్నను బీఆర్ఎస్ స్టేట్​ జనరల్ సెక్రటరీ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. బాధితుడిని మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.