బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించండి : జాజుల

 బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించండి : జాజుల
  • కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్​కు జాజుల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ అసెంబ్లీలో చేసిన చట్టాన్ని పార్లమెంట్​లో ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈ మేరకు బుధవారం ఎంపీ వద్దిరాజు ఆధ్వర్యంలో పార్లమెంట్ లో కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత మంత్రి వీరేంద్ర కుమార్​తో భేటీ అయ్యారు. బీసీల సమస్యలు, డిమాండ్లను కేంద్ర మంత్రికి వివరించి, వినతి పత్రాన్ని అందజేశారు. 

అనంతరం జాజుల మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీసీలు చేసిన పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా మొదటిసారి కులగణన చేపట్టిందన్నారు. అనంతరం రిజర్వేషన్లను 42 శాతానికిపెంచుతూ అసెంబ్లీలో అన్ని పార్టీల మద్దతుతో చట్టాన్ని ఆమోదించి ఢిల్లీకి పంపించారని గుర్తుచేశారు. ఈ మేరకు ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రాజ్యాంగ సవరణ ద్వారా 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని కోరారు.