ఓ వ్యక్తి ‘ఈబే’లో దేశాన్నే అమ్మకానికి పెట్టిండు

ఓ వ్యక్తి  ‘ఈబే’లో  దేశాన్నే అమ్మకానికి పెట్టిండు

ఆన్‌‌‌‌లైన్ షాపింగ్ పోర్టల్స్‌‌‌‌లో గాడ్జెట్లు, బట్టలు, ఫర్నిచర్.. ఇలా ఎన్నో వస్తువులు కనిపిస్తాయి. కానీ 2006లో ఒక వ్యక్తి ఏకంగా ఒక దేశాన్నే అమ్మకానికి పెట్టిండు. అమెజాన్, ఫ్లిప్‌‌‌‌కార్ట్ లాగానే ‘ఈబే’ అనేది కూడా ఇ‌‌‌‌–-‌‌‌‌కామర్స్ పోర్టల్. ఇందులో వస్తువులు కొనొచ్చు, అమ్మొచ్చు. అయితే, 2006లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌‌‌‌కు చెందిన ఒక వ్యక్తి ఈబేలో న్యూజిలాండ్​ని అమ్మకానికి పెట్టాడు. ఆ దేశం సాధించిన మెడల్స్, ట్రోఫీల వివరాలతో పాటు ‘ఇక్కడ వాతావరణం ఎంతో అనుకూలంగా ఉంటుంది’ అని రాసి పోస్ట్ చేశాడు.

ఆ దేశానికి అతను పెట్టిన ధర ఒక సెంట్. అంటే డాలరులో వందోవంతు. ఈ పోస్ట్‌‌‌‌కు కొద్దిరోజుల్లోనే 6,000 వ్యూస్ వచ్చాయి. కొనేందుకు 22 మంది బిడ్ కూడా వేశారు. దాంతో ధర ఒక సెంట్ నుంచి మూడు వేల డాలర్లకు పెరిగింది. ఈ న్యూస్ వైరల్ అయింది. విషయం తెలుసుకున్న ఈబే సంస్థ మీడియా ముందుకొచ్చి ‘న్యూజిలాండ్ ఈజ్ నాట్ ఫర్ సేల్’ అని  చెప్పడంతో కథ ముగిసింది.