
ఫ్రెండ్స్ ఛాలెంజ్ చేయడంతో మద్యం మత్తులో ఓ యువకుడు చెరువులోకి దూకి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ లోని బండ్లగూడకు చెందిన నలుగురు యవకులు కర్ణాటకలోని కమలాపూర్ చెడుగుప్పకు వెళ్లారు. అక్కడ ఫుల్ గా మద్యం తాగారు. ఆ మత్తులో రెచ్చగొట్టడంతో సాజిద్ అనే యువకుడు ఈతరాకపోయిన నదిలో దూకాడు. మునిగిపోతున్న అతడిని తోటి ఫ్రెండ్స్ కాపాడకుండా వీడియో తీస్తూ ఉండిపోయారు. దీంతో అతను ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని హైదరాబాద్ పాతబస్తికి తీసుకొచ్చి అంతక్రియలు నిర్వహించారు. అతను ఎలా చనిపోయాడు .. అక్కడ ఆరోజు ఏం జరిగిందో వీడియోను తోటి ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారు. స్థానిక పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.