రాహుల్ ను ముద్దుపెట్టుకున్న యువకుడు

రాహుల్ ను ముద్దుపెట్టుకున్న యువకుడు

కేరళ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీకి విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఓ యువకుడు రాహుల్ గాంధీని దగ్గరగా కావలించుకుని ముద్దుపెట్టుకున్నాడు. మొదట షాక్ అయిన రాహుల్ గాంధీ.. ఆ తర్వాత అతడికి నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చారు.

రాహుల్ గాంధీ ఓ కార్యక్రమంలో పాల్గొని కారులో కూర్చుని వెళ్లడానికి సిద్ధమవుతుండగా ఈ సంఘటన జరిగింది. రాహుల్ ను అభిమానులు ఫాలో అయ్యారు. పోలీసులను దాటుకుని ఓ యువకుడు కారు దగ్గరకు వచ్చాడు. రాహుల్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ముందుకొచ్చాడు. రాహుల్ కూడా ఓకే అంటూ చేయి అందించాడు. షేక్ హ్యాండ్ ఇస్తూనే… గబుక్కున ఆ కుర్రాడు కారు విండో లోంచి.. రాహుల్ మెడపై చేయి పెట్టి .. లాక్కుంటూ రాహుల్ చెంపపై ముద్దుపెట్టాడు. సెక్యూరిటీ అతడిని లాగారు. రాహుల్ నవ్వుతూ మిగతా వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారు.