
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తి గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. టౌన లోని కొత్త కుమ్మరివాడకు చెందిన తోట పురుషోత్తం బుధవారం రాత్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి బ్లేడ్ తో గొంతు కోసుకున్నాడు. పోలీస్ సిబ్బంది అతడిని వెంటనే రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అతని ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు. ఉట్నూర్ మండలం హస్నాపూర్ లోని తన భూమి విషయంలో అన్యాయం జరుగుతుందని పురుషోత్తం అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కాగా అతను గతంలోనూ ఇలా భయపెట్టే గొంతు కోసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. పోలీ సుల విధులకు ఆటంకం కలిగించినందుకు అతడిపై కేసు నమోదు చేశారు.