ఎల్బీ నగర్ ఫ్లై ఓవర్ పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మంచాల మండలం లోయపెల్లికి చెందిన నరేందర్ గౌడ్ గా గుర్తించారు. నరేందర్ గౌడ్ ఆత్మహత్యకు కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

