డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించలేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించలేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

అదిలాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి  ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. బోథ్ మండలం ధన్నూర్ గ్రామానికి చెందిన మీసాల సాయన్న అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. తనకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లును నిర్మించి.. ఇవ్వడం లేదని పురుగుల మందు తాగాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేందుకు స్థానిక టీఆర్ఎస్ నేత తన వద్ద 50 వేల రూపాయలు వసూలు చేశాడని మీసాల సాయన్న ఆరోపించాడు. 

రూ.50 వేలు ఇచ్చి మూడేళ్లు పూర్తైనా ఇప్పటికీ ఇల్లు నిర్మించలేదనే మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం బోథ్ ప్రభుత్వ ఆసుపత్రిలో మీసాల సాయన్నకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.