మంగళవారం బీజేపీ రాష్ట్ర పధాధికారుల సమావేశం

మంగళవారం బీజేపీ రాష్ట్ర పధాధికారుల సమావేశం

మంగళవారం (జులై 5న) ఉదయం 11 గంటలకు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరగనుంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను పదాధికారులకు  రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వివరించనున్నారు. అనంతరం జిల్లా, మండల కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్ణయాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేలా కార్యాచరణ రూపొందించనున్నారు. 

తెలంగాణపై బీజేపీ రూట్ మ్యాప్ 
అన్ని రాష్ట్రాల సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లో నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై చర్చించారు.