ఆదిపురుష్ చూడటానికి వచ్చిన కోతి.. వైరల్ అవుతున్న వీడియో

ఆదిపురుష్ చూడటానికి వచ్చిన కోతి.. వైరల్ అవుతున్న వీడియో

రామాయణ కథాంశంతో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్(Prabhas) రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా నటించారు.

ఈ మూవీ ప్రదర్శించే ప్రతి సినిమా హాల్లో ఒక సీటును హనుమంతుడి కోసం కేటాయించాలి అంటూ దర్శకుడు ఓం రౌత్ నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్స్ ని కోరిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతి థియేటర్ ఓనర్స్ హనుమంతుడు కోసం ఒక సీట్ ప్రత్యేకంగా కేటాయించారు.

 ఇక తాజాగా ఆదిపురుష్ సినిమా ప్రదర్శితం అవుతున్న ఓ థియేటర్ లో కోతి ప్రత్యేక్షమయ్యింది. థియేటర్ విండోలో నుండి వచ్చిన ఆ కోతి ఆదిపురుష్ సినిమాని చూస్తుంటే ఒక వ్యక్తి వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోకు ఆదిపురుష్ మూవీ టీం కూడా స్పందించింది.