అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణాపై నాన్ బెయిల్ వారెంట్ జారీ 

అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణాపై నాన్ బెయిల్ వారెంట్ జారీ 

ముంబై : నకిలీ కుల ధ్రువీకరణ పత్రం కేసులో అమరావతి ఎంపీ నవనీత్‌ రాణా, ఆయన తండ్రిపై ముంబై కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేసింది. అంతకు ముందు సెప్టెంబర్‌లోనూ ఎంపీతో పాటు ఆమె తండ్రిపై వారెంట్‌ జారీ అయ్యింది. ఈ క్రమంలో కొనసాగుతున్న కేసుపై సోమవారం మరోసారి కోర్టులో విచారణ జరిగింది. వారెంట్‌ అమలు కోసం మరింత సమయం కావాలని పోలీసులు కోరారు.

పోలీసుల విజ్ఞప్తిని తోసిపుచ్చిన న్యాయస్థానం.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ నవనీత్‌ రాణాతో పాటు ఆమె తండ్రిపై తాజాగా నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. 

ఆ తర్వాత సర్వీస్ ఆఫ్‌ వారెంట్‌పై నివేదికను సమర్పించేందుకు కేసు విచారణను ఈ నెల 28కి వాయిదా చేశారు. ఎంపీ నవనీత్‌ రాణా, ఆమె తండ్రి నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి.