పల్లె రవి కుమార్ కు తృటిలో తప్పిన ప్రమాదం

పల్లె రవి కుమార్ కు తృటిలో తప్పిన ప్రమాదం
  • కారు టైర్ బ్లాస్ట్ అవ్వడంతో యాక్సిడెంట్

ఎల్​బీ నగర్, వెలుగు: రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ కు మంగళవారం మధ్యాహ్నం  కొత్తపేట వద్ద తృటిలో ప్రమాదం తప్పింది. స్వల్పగాయాలతో ఆయన బయటపడ్డారు. రవికుమార్ ప్రయాణిస్తున్న కారు కొత్తపేట క్రాస్ రోడ్డు సమీపంలో టైరు పేలిపోవడంతో అదుపు తప్పి డివైడర్ ను, మెట్రో  పిల్లర్ ను  ఢీ కొట్టింది. దీంతో కారు ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో కారులో పల్లె రవి కుమార్ తో పాటు ఆయన స్నేహితుడు రాజు, డ్రైవరు ఖదీర్ ఉండగా స్వల్ప గాయాలు అయ్యాయి.