కల్తీని కనిపెట్టే కొత్త గాడ్జెట్

 కల్తీని కనిపెట్టే కొత్త గాడ్జెట్

ఈ కాలంలో ఫుడ్‌‌‌‌లో కల్తీ తెలుసుకోవడం కొంత కష్టమైన పనే. అయితే, టెక్నాలజీ సాయంతో కల్తీని గుర్తించి, కొంత జాగ్రత్త పడొచ్చు అంటోంది హారియెట్‌‌‌‌ ఆల్మండ్‌‌‌‌. లండన్‌‌‌‌లోని నార్త్‌‌‌‌అంబ్రియా యూనివర్సిటీలో డిగ్రీ చదువుతోంది ఆల్మండ్‌‌‌‌. యూనివర్సిటీ పెట్టిన ‘బ్రిలియంట్లీ యూజ్‌‌‌‌ ఫుల్‌‌‌‌ డిజైన్‌‌‌‌ అవార్డ్‌‌‌‌’ కాంపిటీషన్‌‌‌‌కోసం ‘స్కూట్‌‌‌‌’ అనే సెన్సర్‌‌‌‌‌‌‌‌ తయారుచేసింది. ఈ మెషిన్స్‌‌‌‌ కాంపిటీషన్‌‌‌‌లో మొదటి బహుమతి గెలుచుకున్నాయి. ఒక మెషిన్‌‌‌‌ చూడ్డానికి షేవింగ్‌‌‌‌ ట్రిమ్మర్‌‌‌‌‌‌‌‌లా ఉంటుంది. ఇంకొకటి బ్లూటూత్‌‌‌‌ స్పీకర్‌‌‌‌‌‌‌‌లా ఉంటుంది. ఈ రెండూ ఫుడ్‌‌‌‌ క్వాలిటీ డిటెక్టివ్‌‌‌‌ సెన్సర్లు. ఫుడ్‌‌‌‌ ఐటమ్‌‌‌‌ను మెషిన్‌‌‌‌తో స్కాన్‌‌‌‌ చేస్తే ఆ ఐటమ్‌‌‌‌లో కల్తీ జరిగిందా? లేదా? కనిపెడుతుంది. రెండో మెషిన్‌‌‌‌తో ఫుడ్‌‌‌‌ ఐటమ్‌‌‌‌ని స్కాన్‌‌‌‌ చేస్తే, దాంతో ఏ రెసిపీ చేయొచ్చో స్పీకర్‌‌‌‌‌‌‌‌లో చెప్పి, ప్రింట్‌‌‌‌ ఇస్తుంది.