జీమెయిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త ఫీచర్ తీసుకొచ్చిన గూగుల్

జీమెయిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త ఫీచర్ తీసుకొచ్చిన గూగుల్

న్యూఢిల్లీ: గూగుల్ యూజర్లు తమ ప్రైమరీ ఈ- మెయిల్ అడ్రెస్ (@gmail.com కి ముందున్నదాన్ని) ఇక నుంచి మార్చుకోవచ్చు. ఫోటోలు, మెసేజ్లు, ఈ-మెయిల్స్ వంటి డేటా అలాగే ఉంటుంది. పాత అడ్రెస్ అలియాస్‎గా వాడుకోవచ్చు. అంటే పాత జీమెయిల్ ఐడీతోనూ జీమెయిల్, మ్యాప్స్, యూట్యూబ్, డ్రైవ్ వంటి యాప్లలో లాగిన్ అవ్వొచ్చు. కొత్తదానితోనూ సైన్ఇన్ అవ్వొచ్చు. కానీ, కొత్త జీమెయిల్ అడ్రెస్ సృష్టించిన తర్వాత 12 నెలలలో మరో కొత్త అడ్రెస్ సృష్టించలేరు.

పాతదాన్ని ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. వినియోగదారులు తమ గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్‎లోని 'పర్స నల్ ఇన్ఫర్మేషన్' విభాగంలో ఈ ఆప్షన్ యాక్టివ్ ఉందో లేదో చూడవచ్చు. ఈ ఫీచర్ను దశలవారీగా గూగుల్ అమల్లోకి తెస్తోంది. ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉండదు. డేటా సురక్షితమని గూగుల్ హామీ ఇస్తున్నప్పటికీ, కొన్ని యాప్ సెట్టింగ్స్ రీసెట్ అయ్యే అవకాశం ఉండటంతో ముందుగా బ్యాకప్ తీసుకోవడం బెటర్.