చంచల్ గూడ స్మశానవాటికలో.. అప్పుడే పుట్టిన మగ శిశువును వదిలేశారు

చంచల్ గూడ స్మశానవాటికలో.. అప్పుడే పుట్టిన మగ శిశువును వదిలేశారు

హైదరాబాద్: చంచల్ గూడ స్మశానవాటిక ఆవరణలో అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసిన వెళ్లిపోయారు. శిశువు ఏడుస్తున్న అరుపులు విన్న స్థానికులు.. స్మశానవాటిక ఆవరణలో శిశువును గుర్తించి మాదన్నపేట  పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే బాబును తీసుకుని మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని.. ప్రాథమిక చికిత్స అనంతరం నిలోఫర్ ఆసుపత్రికి తరలించనున్నట్లు వైద్యులు తెలిపారు. ఇద్దరు మహిళలు శిశువును పడేసి పారిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. శిశువు వదిలేసిన ఏరియాలో సీసీ పుటేజ్ పరిశీలిస్తున్నారు.