
హైదరాబాద్: పెళ్లై నెల రోజులు కూడా కాకముందే ఓ వ్యక్తి తన భార్య చేతిలో హత్యకు గురయ్యాడు. టప్పచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని ముజాహిద్ నగర్ లో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే అస్లాం (25) అనే యువకుడికి 20 రోజుల కిందట సమ్రీన్ అనే యువతితో పెళ్లి జరిగింది. పెళ్లి అయిన నాటి నుండి మద్యం మత్తులో అస్లాం భార్యను కొట్టేవాడని, ఈ రోజు ఉదయం కూడా అలాగే కొట్టాడని సమాచారం. అయితే అతని వేధింపులు భరించలేని సమ్రీన్ ఆవేశంలో రోకలిబండతో తలపై కొట్టి గాయపరిచింది. తీవ్రగాయాలపాలై స్పృహ తప్పి పడిపోయాడని అస్లాం ను వెంటనే అతని కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేస్తున్న సమయంలో అస్లాం మృతి చెందాడని అధికారులు తెలిపారు.