
నోట్లు పంచుతున్న వ్యక్తిని మంగళవారం అరెస్టు చేసినట్టు కుషాయిగూడ సీఐచంద్రశేఖర్ చెప్పారు. మల్కాజ్ గిరి లోక్ సభ టీఆర్ఎస్ అభ్యర్థి ఓటర్లకు పైసలు పంచుతున్నాడన్న సమాచారంతో ఎస్సై బి. శ్రీ-నివాస్ కాప్రా, బంజార కాలనీకి వెళ్లి పరిశీలించారన్నారు. కూకట్ పల్లికి చెందిన కూచిపూడి విజయ్ బాబు (33) స్థానికులకు డబ్బులు పంచుతుంటే అదుపులోకి తీసుకున్నట్టుతెలిపా రు. అతని నుంచి రూ.35 వేల నగదుసీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు తెలిపా రు.
నగదు పంపిణీ అడ్డకున్న కాంగ్రెస్
కీసర, వెలుగు: కీసర మండలంలోని నా గరం ఎస్సీ కాలనీలో టీఆర్ఎస్ పార్టీ నేతల నగదుపంపిణీని కాం గ్రెస్ పార్టీ నేతలు అడ్డుకున్నారు. ఘన పురం కొండల్ రెడ్డి, పంగాహరిబాబు, పంగా శ్రీహరి, రవీందర్ తో పాటు పలువురు నాయకులు మర్రి రాజశేఖర్ రెడ్డికి ఓటు వేయాలని నగదు పంపిణీ చేస్తుండగా కాంగ్రెస్ నాయకులు వారిని వారించారు.విషయం తెలసుకున్న పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుండి పంపించేశారు.
నగదు పంపిణీ చేస్తున్న మంత్రి బంధువు?
ఘట్ కే సర్ , వెలుగు: ఘట్ కేసర్ మండల పరిధిఏదులాబాద్ గ్రామంలో మంగళవారం రాత్రి మంత్రి మాల్లా రెడ్డి బంధువు నగదు పంపిణీచేస్తుండగా కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొనే లోపే పారిపోయినట్టు తెలిసింది.