మహిళపై దాడి చేసి ఓ దుండగుడు గోల్డ్ చైన్ లాక్కెళ్లిన ఘటన రాజన్న సిరిసిల్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్లో పిల్లి శ్రీలత తన కుటుంబంతో నివసిస్తున్నారు.
ఆగస్టు 13 తెల్లవారు జామున ఆమె కుక్కను కట్టేయడానికి ఇంటి మెయిన్డోర్తెరిచి బయటకు వచ్చింది. అదే సమయంలో ముఖం కప్పుకొని ఉన్న ఓ దుండగుడు మరో వైపు ఉన్న డోర్పక్కన నక్కాడు. మహిళ అనుమానం వచ్చి చూడగా.. అకస్మాత్తుగా అతను శ్రీలతపై రాడ్డుతో విరుచుకుపడ్డాడు.
వనిత ధైర్యంగా ప్రతిఘటించి రాడ్డును లాక్కున్నారు. కానీ మెడలోని 3 తులాల బంగారు చైన్ని దుండగుడు లాక్కుని పారిపోయాడు.
ఈ ఘటనపై పోలీసులు నమోదు చేయగా రాడ్డు దర్యాప్తులో కీలకంగా మారనుంది. ఘటన సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో నమోదయ్యాయి.