గద్దర్ అంత్యక్రియల్లో విషాదం..ఒకరు మృతి

గద్దర్ అంత్యక్రియల్లో విషాదం..ఒకరు మృతి

ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియల్లో విషాదం ఏర్పడింది. గద్దర్ ఇంటి నుంచి బయలుదేరిన అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. వేలాది మంది అభిమానుల అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర స్కూల్ ఆవరణకు చేరుకుంది. అంతిమ యాత్ర జరుగుతుండగా.. సియాసత్ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ అంతిమయాత్ర సాగుతున్న డీసీఎం వెహికల్ నుంచి కిందికి దిగబోయి జారి  పడ్డారు. అప్పటికే రోజంతా అలసిపోయి ఉన్న ఆయనకు కింద పడిన సమయంలోనే కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారు. అక్కడ ఉన్నవాళ్లు మంచినీళ్లు ఇచ్చి, సీపీఆర్ చేయడానికి ప్రయత్నించారు. తర్వాత హస్పిటల్ కు తరలించాక అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.

ప్రజాకవి గద్దర్ ​అంత్యక్రియలకు జనం పోటెత్తారు. వేల సంఖ్యలో అశేష జనవాహిని గద్దర్ అంతిమయాత్రలో పాల్గొంది. ఎల్బీస్టేడియం నుంచి అల్వాల్​లోని మహాబోధి స్కూలు వరకు సాగిన యాత్రలో వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు, ఆయన అభిమానులు, శ్రేయాభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గద్దర్ అభిమానులను నియంత్రించడం పోలీసులకు కష్టంగా మారింది.