ఆర్మీ ట్రెనింగ్ వదిలేసి వచ్చి..సూడో పోలీసుగా మారిండు

ఆర్మీ ట్రెనింగ్ వదిలేసి వచ్చి..సూడో పోలీసుగా మారిండు

హైదరాబాద్,వెలుగు: పోలీస్ శాఖలో జాబ్స్ ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న సూడో పోలీసును  సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వివరాలను ఆదివారం టాస్క్ ఫోర్స్ డీసీపీ రష్మీ పెరుమాళ్ మీడియాకు తెలిపారు.  వనపర్తి జిల్లా కళింగపూర్, దొంతికుంటకు చెందిన కడావత్ సోమ్లా నాయక్(44) ఇంటర్ చదివాడు. 

2004లో అసోం రైఫిల్స్ లో సోల్జర్ గా సెలెక్ట్ అయ్యాడు. ట్రైనింగ్ లో అనారోగ్యానికి గురయ్యాడు.  ట్రైనింగ్ చేయలేక బయటకు వచ్చేశాడు. అనంతరం ఉమ్మడి ఏపీలో పోలీస్ సెలక్షన్స్ కు ప్రయత్నించి విఫలం చెందాడు. పోలీస్ యూనిఫామ్ లక్ష్యం నెరవేరకపోవడంతో సూడో పోలీస్ గా మారాడు. 2012 నుంచి కానిస్టేబుల్, ఎస్ఐ యూనిఫామ్స్ ధరిస్తూ నమ్మించాడు. 

పోలీస్ శాఖలో జాబ్ లు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్నాడు. బంజారాహిల్స్ కు చెందిన యువకుడు గౌరీ శంకర్ వద్ద రూ.2 లక్షలు,  మరికొందరి వద్ద  రూ.11లక్షలకు పైగా వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టి నిందితుడు సోమ్లా నాయక్ ను అరెస్ట్ చేశారు. విచారణ కోసం మాసబ్ ట్యాంక్ పోలీసులకు అప్పగించారు.