లోయర్​ ట్యాంక్​బండ్​లో వ్యక్తి హత్య

లోయర్​ ట్యాంక్​బండ్​లో  వ్యక్తి హత్య

ముషీరాబాద్, వెలుగు:  దోమలగూడ పీఎస్​పరిధిలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడి గొంతు కోసి హత్య చేశారు. లోయర్ ట్యాంక్ బండ్ గోశాల వెనుక ఉన్న మారుతీనగర్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి బషీర్ (30) అనే యువకుడు రక్తపు మడుగులో పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. చిక్కడపల్లి ఏసీపీ మొగులయ్య, సీఐ శ్రీనివాస్ రెడ్డికి సమాచారం ఇవ్వడంతో వచ్చి పరిశీలించారు. క్లూస్ టీమ్​ను రప్పించి ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని గాంధీ దవాఖానాకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.