RCB vs MI: కృణాల్ పాండ్య కిరాక్ ఇన్నింగ్స్.. అతి కష్టం మీద ముంబైపై బెంగళూర్ గెలుపు

RCB vs MI: కృణాల్ పాండ్య కిరాక్ ఇన్నింగ్స్.. అతి కష్టం మీద ముంబైపై బెంగళూర్ గెలుపు

ఓపెనర్లలో విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. జాకోబ్ బెథెల్ 27 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత పడిక్కల్, ఆ వెంటనే కెప్టెన్ పటీదార్.. ఇలా వరుసగా క్యూ కట్టారు. ముంబై ఇచ్చిన స్వల టార్గెట్ 167 ను  ఛేదించే క్రమంలో.. టాపార్డర్ అంతా పెవిలియన్ బాట పట్టారు. ఇక అయిపోయింది బెంగళూర్ పని అనుకునే లోపే.. అప్పుడొచ్చాడు కృణాల్ పాండ్య.. కిరాక్ ఇన్నింగ్స్ తో బెంగళూర్ కు గెలుపు బాటలు వేశాడు. ముంబైపై గెలిచి పాయింట్స్ పట్టికలో టాప్ ప్లేస్ కు వెళ్లింది. 

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూర్.. ముంబైని 166 రన్స్ కే కట్టడి చేయగలిగింది. ఆ తర్వాత తక్కువ స్కోరే కదా అని ఛేజింగ్ కోసం వచ్చిన బెంగళూర్ .. టపాటపా వికెట్లు పడటంతో రిస్క్ లో పడిపోయింది. 
కోహ్లీ (0),జాకోబ్ బెథెల్ (27),పడిక్కల్ 12,రజత్ పటీదార్ 8 రన్స్.. ఇలా దాదాపు అందరూ పెవిలియన్ బాట పట్టడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది బెంగళూర్.

దీంతో బెంగళూర్ ఓడిపోతుందా ఏంటి.. అనే డౌట్స్ ఫ్యాన్స్ కు వచ్చాయి. కానీ కృణాల్ పాండ్య 67 (43 బంతులలో 4 ఫోర్లు, 4 సిక్సులు) తో చెలరేగుతూ గెలుపుకు బాట వేశాడు. 18వ ఓవర్ లో ఘజన్ఫర్ బౌలింగ్ లో ఔటవటంతో మ్యాచ్ ఎవరు గెలుస్తారనే సస్పెన్స్ కొనసాగుతూనే వచ్చింది.  అతి కష్టం మీద చివరి బాల్ వరకు బెంగళూర్ బ్యాటర్లు పోరాటం చేయాల్సి వచ్చింది. చివరి బంతికి 2 రెండు రన్స్ కొట్టాల్సి ఉండగా.. రెండు రన్స్ చేసి విన్ అయ్యింది. దీంతో టాప్ ప్లేస్ ను ఆర్సీబీ ఆక్యుపై చేసుకుంది. 

ఇక ముంబై బౌలర్లలో కోర్బిన్ బాష్ 4 వికెట్లు తీసి బెంగళూర్ ను డిఫెన్స్ లో పడేశాడు. ఆ తర్వాత దీపక్ చాహర్ కోహ్లీ, పడిక్కల్ లాంటి మెయిన్ వికెట్స్ తీసుకున్నాడు. గజన్ఫర్ర, రాజ్ బవా చెరో వికెట్ తీసుకున్నారు.