హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్-బెంగళూర్ ORR పైన బొంగులూరు నుంచి తుక్కుగూడ వెళ్లే మార్గంలో 111.5 KM బోర్డ్ ఎగ్జిట్-12 దగ్గరలో ఒక కారు AP 40 HY 9599 ప్రమాదానికి గురైంది.
డ్రైవర్ తన కారును అతి వేగంగా, నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా నడుపుకుంటూ అదే మార్గంలో నాలుగో లైన్లో ముందు వెళుతున్న ఒక కంటైనర్ ట్రక్కు 28 TB 9380ని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తుల తలకు తీవ్ర గాయాలై.. రక్తం కోల్పోవడంతో అక్కడికక్కడే చనిపోయి పడి ఉన్నారు.
పోలీసులు మృతదేహాలను కారు నుంచి బయటకు తీసి, శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. చనిపోయిన ఇద్దరినీ.. కారు డ్రైవ్ చేస్తున్న కత్తి భరత్ కాంత్ s/o మోహన్ రావు, వయస్సు 31 సంవత్సరాలు.. OCc Actor, R/o H. No 103, సాహితీ ప్యారడైజ్, రైల్వే గేట్ రోడ్, వేదాయపాలెం నెల్లూరు, ఆంధ్రప్రదేశ్.
మరొకరిని.. గూడ సాయి త్రిలోక్ S/o మాల్యాద్రి, వయస్సు 31 సంవత్సరాలు, R/o నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ గా పోలీసులు గుర్తించారు.ఈ ఇద్దరూ నెల్లూరు నుంచి హైదరాబాద్కి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
